CM Revanth Reddy : హైడ్రా మా ప్రభుత్వ అంకుశం.. తగ్గేదేలే అంటున్న సీఎం రేవంత్

చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని అన్యాయంగా మేడలు కట్టుకునే వారిపట్ల హైడ్రాను ప్రభుత్వం అంకుశంగా వాడుతోందని, ఎవరు అడ్డుకుంటారో రావాలని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటివారి సంగతి తేల్చడానికే హైడ్రా వచ్చిందని స్పష్టం చేశారు. హైదరాబాద్లోని చార్మి నార్ వద్ద రాజీవ్ గాంధీ 34వ సద్భావన యాత్ర సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు.
ఈ ఏడాది సద్భావన అవార్డును మాజీ మంత్రి డాక్టర్ గీతారెడ్డికి ముఖ్యమంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మా ట్లాడుతూ.. అక్రమార్కులు మాత్రమే హైడ్రాను చూసి భయపడుతున్నారని అన్నారు. కేసీఆర్ కుంటుంబానికి రాజీవ్ గాం ధీ కుటుంబానికి ఏమైనా పోలిక ఉందా? మీ చరిత్ర అంతా దోపిడీ, దొంగతనం, అధికార దుర్వినియోగం ఉందని సీఎం మండిపడ్డారు. రబ్బరు చెప్పులు లేనోళ్లు విమానాల్లో తిరుగుతున్నారని సెటైర్ వేశారు. ఈశ్వరీ బాయి కూతురుగా గీతారెడ్డి ప్రజలకు చేసిన సేవలు గుర్తు చేసుకోవడం సంతోషమన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com