CM Revanth Reddy : బుల్డోజర్లు అడ్డుపెట్టినా తొక్కుకుంటూ పోతాం.. సీఎం రేవంత్ ఆగ్రహం

మూసీ ప్రక్షాళన ఎవరు అడ్డుకున్నా ఆగబోదని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మూసీ ప్రక్షాళనకు కొంత మంది దుర్మార్గులు అడ్డొస్తున్నారన్నారు. మూసీ ప్రక్షాళన, బుల్డోజర్‌లకు ఎవరు అడ్డు వచ్చినా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బుల్డోజర్ ఎక్కించి తొక్కుకుంటూ పోతామని హెచ్చరించారు. ఇది ట్రైలర్ మాత్రమే సినిమా ముందు ఉందని హెచ్చరించారు. బావ, బామ్మర్దులు ఇద్దరూ తనతో పాదయాత్రకు రావాలని సవాల్ విసిరారు. ఈ ప్రాజెక్టు చేపట్టాలని నిశ్చయించుకున్నామనీ.. మరో 30 రోజుల్లో తుది రూపం తీసుకొస్తామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. జనవరి తొలివారంలో వాడపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభిస్తానని సీఎం తెలిపారు. మరోవైపు సంగెం నుంచి నాగిరెడ్డిపల్లె వరకు ధర్మారెడ్డి కాల్వ వెంబడి రెండున్నర కిలో మీటర్ల మేర రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేశారు. మూసీ పరీవాహక ప్రాంత రైతుల కష్టాలు అడిగి తెలుసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com