CM Revanth Reddy : రాజ్యాంగ ఫలాలు ప్రజలందరికీ అందాలి : సీఎం రేవంత్ రెడ్డి
భారతరత్న డాక్టర్ బీఆర్ అంబే ద్కర్ మార్గనిర్దేశనంలో అందించిన రాజ్యాంగ ఫలాలు ప్రజలందరికీ అందాలనేది ప్రజా ప్రభు త్వ సంకల్పమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశ పౌరులకు న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను అందిస్తూ రాజ్యాంగాన్ని ఆమోదించిన నేటికి 75 ఏళ్లు పూర్తయిన సంద ర్భంగా ప్రజలకు 'భారత రాజ్యాంగ దినోత్సవ' శుభాకాంక్షలు చెప్పారు. 1949 నవంబర్ 26 న రాజ్యాంగాన్ని ఆమోదిస్తూ తీసుకున్న నిర్ణ యంతో భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా పరిఢవిల్లుతోందని అన్నారు. దేశాన్ని సమున్నతంగా నిలబెట్టిన రాజ్యాంగ నిర్మాతలను సంవిధాన్ దివస్ రోజున స్మరించుకోవడమే కాకుండా రాజ్యాంగ విలువలు కాపాడుతూ ఆ మహాశయుల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ నిరంతరం పనిచేయాలని సీఎం రేవంత్ ఆకాంక్షించారు. ప్రతిరోజు మన హక్కులు, బాధ్యతలను గుర్తు చేస్తూ అందరికీ సమానా అవకాశాలతో ప్రగ తిపథంలో బాటలు వేయడానికి నిత్యస్ఫూర్తిగా నిలిచే మూలస్తంభం మన రాజ్యాంగం అని సీఎం పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com