CM Revanth Reddy : అక్బరుద్దీన్ ను డిప్యూటీ సీఎం చేస్తా : సీఎం రేవంత్

CM Revanth Reddy : అక్బరుద్దీన్ ను డిప్యూటీ సీఎం చేస్తా : సీఎం రేవంత్
X

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున కొడంగల్ నుంచి పోటీ చేయించి గెలిపిస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన గెలిచాక డిప్యూటీ సీఎంను చేస్తానని చెప్పారు. శనివారం అసెంబ్లీ బడ్జెట్‌పై చర్చ సందర్భంగా అక్బరుద్దీన్‌ ఒవైసీ మాట్లాడుతూ.. పాతబస్తీకి మెట్రో రైలు అంశాన్ని లేవనెత్తారు. దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి.. పాతబస్తీ మెట్రో నిర్మాణాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పాతబస్తీ మెట్రోకు శంకుస్థాపన చేశామన్నారు. హైదరాబాద్‌కు మెట్రో రైలు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. పాతబస్తీ ప్రజలకు మేలు కలిగేలా చాంద్రాయణగుట్ట మీదుగా మెట్రో రైలు నిర్మాణం చేపడతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

మోదీని పెద్దన్న అంటే తప్పేంటి?

మెట్రో రెండో దశకు ఇప్పటికే భూసేకరణ మొదలుపెట్టినట్లు రేవంత్ తెలిపారు. కానీ నిధుల విషయంలో కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు. ‘78 కి.మీ మెట్రో ప్రాజెక్టు కోసం కేంద్రానికి నివేదిక ఇచ్చాం. నిధులన్నీ యూపీ, బిహార్‌, గుజరాత్‌కే కేటాయిస్తున్నారు. అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలని బహిరంగసభ వేదికగా మోదీకి చెప్పాను. రాష్ట్రాల పట్ల పెద్దన్నలాగా వ్యవహరించాలని కోరా. ప్రధానిని పెద్దన్న అని అనడంలో తప్పేముంది? రాష్ట్రానికి నిధులు సాధించటం కోసమే ఆయనను పెద్దన్న అని అన్నాను. ఫెడరల్‌ సిస్టమ్ లో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టుకోవాల్సిందే. వాళ్లు ఇవ్వనంత మాత్రాన రాష్ట్రాభివృద్ధి ఆగదు’ అని రేవంత్ పేర్కొన్నారు.

Tags

Next Story