CM Revanth Reddy : గిరిజన విద్యార్థినికి సీఎం రేవంత్‌ ఆర్థిక సాయం

CM Revanth Reddy : గిరిజన విద్యార్థినికి సీఎం రేవంత్‌ ఆర్థిక సాయం
X

మెడిసిన్‌లో సీటు సాధించినప్పటికీ ఫీజు కట్టే ఆర్థిక స్థోమత లేక ఇబ్బంది పడుతున్న గిరిజన విద్యార్థినికి సీఎం రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. చదువుకు అవసరమైన ఆర్థిక సాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. కుమురంభీం జిల్లా జైనూరు మండలం జెండాగూడ గ్రామానికి చెందిన సాయిశ్రద్ధ నీట్‌లో ర్యాంకు సాధించి ఎంబీబీఎస్‌లో సీటు పొందారు. అయితే ఫీజు కట్టే ఆర్థిక స్థోమత లేక ఇబ్బంది పడుతున్నారని సీఎం దృష్టికి రావడంతో.. ఆమెను పిలిపించి ఆర్థిక సాయం చేశారు. డాక్టర్ కావాలన్న సాయిశ్రద్ధ కల నెరవేర్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. సీఎంకు సాయిశ్రద్ధ, ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Tags

Next Story