CM : ఉద్యోగుల సమస్య పరిష్కారంపై సీఎం రేవంత్ సానుకూలం

CM : ఉద్యోగుల సమస్య పరిష్కారంపై సీఎం రేవంత్ సానుకూలం
X

తెలంగాణ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్‌ సెంటర్‌లో ఉద్యోగుల జేఏసీతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చర్చలు జరిపారు. వారి డిమాండ్లపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. భేటీ అనంతరం జేఏసీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో మాట్లాడి ప్రకటన చేస్తామని సీఎం చెప్పినట్లు వారు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అన్ని విషయాలను ఒకదాని తర్వాత ఒకటి పరిష్కరించుకుంటూ వస్తున్నామనీ.. ఒకటి రెండ్రోజుల్లో ప్రకటన చేస్తామని సీఎం తెలిపినట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరిస్తుందన్న నమ్మకం ఉందని జేఏసీ ప్రతినిధులు తెలిపారు. ఆర్థిక, ఆర్థికేతర సమస్యను పరిష్కిస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు జేఏసీ నేతలు తెలిపారు. అటు భట్టి, పొన్నం, శ్రీధర్ బాబులతో ప్రభుత్వం సబ్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. DAలపై స్పష్టత ఇస్తామని సీఎం ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులకు స్పష్టం చేసినట్లు సమాచారం.

Tags

Next Story