Hydra Police Station : మే 8వ తేదీన హైడ్రా పోలీస్ స్టేషన్ ను ప్రారంభించనున్న సీఎం రేవంత్

హైడ్రా స్పెషల్ పోలీస్ స్టేషన్ ను ఈ నెల 8వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. రాణిగంజ్ లోని బుద్ధభవన్ ను ఆనుకుని ఉన్న భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ తో కలిపి రెండు అంతస్తుల్లో ఇది ఏర్పాటవుతున్నది. ఈ నెల 8వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. సర్కారు ఆస్తులను కాపాడే క్రమంలో అక్కడక్కడ ఆస్తులు కబ్జాల కు, ఆక్రమణకు గురైనట్లు నిర్థారించిన తర్వాత హైడ్రా కూల్చివేతలు చేపట్టినా, అందుకు బాధ్యులైన వారిపై అమీన పూర్, శేరిలింగంపల్లి తదితర పోలీస్ స్టేషన్లలో ఇప్పటి వరకు నమోదైన 48 కేసులు హైడ్రా పోలీస్ స్టేషన్ కు బదిలీ చేసే అవకాశమున్నట్లు తెలిసింది. వీటిలో ముఖ్యంగా నార్నే సంస్థతో పాటు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తదితరులపై నమోదైన కేసులున్నాయి. ముఖ్యంగా హైడ్రాకు పోలీస్ స్టేషన్ లేకపోవటంతో కబ్జాలకు పాల్పడిన ఆక్రమణదారులపై హైడ్రా వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేయించింది. పోలీస్ స్టేషన్ అందుబా టులోకి వచ్చిన తర్వాత ఆక్రమణలు, కబ్జాలకు సంబంధించిన హైడ్రానే నేరుగా కేసులు నమోదు చేసి, నాంపల్లి కోర్టు కాంప్లెక్స్ లో హైడ్రాకు కేటాయిం చిన ప్రత్యేక కోర్టు ముందు నిందితులను హాజరు పర్చనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com