TG : ఈనెల 17న ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి!

X
By - Manikanta |14 Aug 2024 4:30 PM IST
సీఎం రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) ఈనెల 17న ఢిల్లీ వెళ్లే ఛాన్స్ ఉంది. కొత్త పీసీసీ చీఫ్ నియామకం, క్యాబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, ఎమ్మెల్యేల చేరికలపై ఆయన పార్టీ పెద్దలతో చర్చించనున్నారు. శ్రావణమాసంలో పీసీసీ చీఫ్ నియామకం, క్యాబినెట్ విస్తరణ పూర్తి చేయాలని ఇప్పటికే పార్టీ అగ్రనేతలు రేవంత్‌కు సూచించారు. దీంతో ఈ సమావేశంలో ఆయా అంశాలపై చర్చలు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ కంపెనీలకు ఆకర్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి తన టీంతో కలిసి అమెరికా, సౌత్ కొరియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో ఆయన పది రోజుల పాటు విదేశాల్లో ఉండగా, ఇవాళ తిరిగి హైదరాబాద్ కు చేరుకున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com