CM Revanth Reddy : వేములవాడపై సీఎం వరాలు..రూ.235 కోట్లతో చేసిన అభివృద్ధి పనులు ఇవే

వేములవాడ పర్యటనలో భాగంగా సీఎం ఉదయం రూ. 235 కోట్లతో చేపట్టనున్న మిడ్ మానేరు రిజర్వాయర్ నిర్వాసితులకు సంబంధించిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. అలాగే రూ. 50 కోట్లతో నూలు డిపో నిర్మాణ పనులు, రూ.45 కోట్లతో చేపట్టిన మూలవాగు బ్రిడ్జి నుంచి దేవస్థానం వరకు రోడ్డు విస్తరణ, రూ. 166 కోట్లతో వైద్య కళాశాల, హాస్టల్ బ్లాక్ నిర్మాణం, రూ. 35 కోట్లతో చేపట్టే అన్నదానం సత్రంనిర్మాణ పనులకు శ్రీకారంచుట్టారు.
రూ.52 కోట్లతో కొనరావుపేట మండలంలో చేపట్టే హై లెవెల్ బ్రిడ్జి పనులు, రూ. 3 కోట్లతో నిర్మించే డ్రైన్ పనులు, మేడిపల్లి మండలంలో జూనియర్ కళాశాల, రుద్రంగి మండల కేంద్రంలో అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రం, సిరిసిల్లలో రూ.26 కోట్లతో నిర్మించిన ఎస్పీ కార్యాలయ భవనం, వేముల వాడలో రూ.1.45 కోట్లతో నిర్మించిన జిల్లా గ్రంథాలయ భవనం, రూ.4.80 కోట్లతో నిర్మించిన వర్కింగ్ ఉమెన్ హాస్టల్ భవనాన్ని రేవంత్ ప్రారంభించారు. అలాగే గల్ఫ్ దేశాలలో మరణించిన 17మంది కార్మికుల కుటుంబాలకు రూ. 85 లక్షల పరిహారం పంపిణీ చేశారు. అలాగే 631 శివశక్తి మహిళా సంఘాలకు రూ. 102 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కులను అందజేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com