CM Revanth Reddy : రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy :  రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
X

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి, వరద నష్టం వివరాలను సమర్పించి, కేంద్రం ప్రకటించిన అతి తక్కువ వరద సహాయంపై మరోసారి పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలు తీరని నష్టాలను మిగిల్చాయి. వరద నష్టాన్ని అంచనావేయడానికి రాష్ట్రంలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రితోపాటు, కేంద్ర ప్రత్యేక బృందం పర్యటించింది. రాష్ట్రంలో వరద నష్టం రూ.10 వేల కోట్లకు పైగా లెక్క తేలగా.. కేవలం రూ.421 కోట్లు మాత్రమే కేంద్రం నిధులు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 6న ఢిల్లీకి వెళ్ళి మరోసారి వివిధ శాఖల కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల వలన కలిగిన నష్టాలను వివరించనున్నారు

Tags

Next Story