CM Revanth : న్యూయార్క్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో సీఎం రేవంత్ సందడి

CM Revanth : న్యూయార్క్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో సీఎం రేవంత్ సందడి
X

ప్రపంచంలోనే అతిపెద్ద స్టాక్ ఎక్సేంజ్, అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకంగా ఉన్న ప్రఖ్యాత న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజ్ ను సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం సోమవారం సందర్శించింది. అమెరికా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి బృందం న్యూయార్క్ నగరంలో పర్యటించింది.

పలువురు ప్రభుత్వ, ప్రైవేటు వ్యాపార సంస్థల ప్రతినిధులతో సమావేశమై పెట్టుబడులకు సంబంధించి చర్చలు జరిపింది. సీఎం రేవంతో పాటు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఇతర ప్రతినిధులు, అధికారులు ఉన్నారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సీఎంఓ అఫీషియల్ హ్యాండిల్.

Tags

Next Story