CM Revanth Reddy : వేములవాడలో సీఎం రేవంత్ కోడె మొక్కులు

దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామివారిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ఉదయం గుడి చెరువు కట్టపైన ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, ఉత్తమకుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వర్రావు, కొండా సురేఖ, పీసీసీ చీఫ్ మహేశ్కు మార్ గౌడ్, ప్రభుత్వ విప్ లు ఆదిశ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సహా ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఘన స్వాగతం పలికారు.
దర్శనంలో భాగంగా ఆలయ ప్రాంగణం వద్ద సీఎం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. తర్వాత రూ. 76 కోట్లతో నిర్మించనున్న ధర్మగుండంతోపాటు ఆలయ విస్తరణ పనులకు భూమిపూజ చేశారు. అభివృద్ధి ప్రణాళికల డిజైన్లను పరిశీలించి, స్థపతి, ఆర్కిటెక్ట్లతో చర్చించి పలు సూచనలు చేశారు. అక్కడి నుండి నేరుగా ఆలయంలోకి వెళ్లగా అర్చకులు ముఖ్యమం త్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆ వెంటనే కోడె మొక్కులు చెల్లించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అ మండపంలో అర్చకులు సీఎంకు ఆశీర్వచనం ఇవ్వగా దేవాదాయ శాఖ తరఫున కమిషనర్ శ్రీధర్ శాలువాతో సత్కరించారు. తదనంతరం సీఎం రేవంత్ సభా ప్రాంగణానికి బయలుదేరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com