CM Revanth Reddy : నేతన్నకు చేతినిండా పని.. రేవంత్ హామీ

చేనేత , పవర్ లూమ్ కార్మికులకు ఉపాధి కల్పించేందుకు అవసర మైన అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణ హ్యాండ్లూమ్స్ వీవర్స్ సహకార సొసైటీ సంస్థ నిర్వహణపై శుక్రవారం సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశానికి సీఎం రేవంత్ అధ్యక్షత వహించారు.
ఆగస్టు 15 తర్వాత అన్ని విభాగాల్లో యూనిఫామ్స్ సమకూర్చే సంస్థలతో సమావేశం నిర్వహించాలని సీఎం కోరారు. ఆర్టీసీ, పోలీస్, వైద్య ఆరోగ్యశాఖ (హెల్త్) విభాగాల్లో ప్రభుత్వ సంస్థల నుంచే యూనిఫామ్స్ కు బట్టలను సమకూర్చుకునేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ సూచించారు. ఇలా చేయడం వల్ల కార్మికులకు మరింత ఉపాధి అవకాశాలు వస్తాయని సీఎం అభిప్రాయపడ్డారు.
మహిళా శక్తి గ్రూప్ సభ్యులకు యూనిఫామ్స్ రూపొందించేందు కు మంచి నాణ్యమైన వస్త్రాలు, ప్రత్యేక డిజైన్ రూపొందించే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి కోరారు. అసలైన కార్మికుడికి లబ్ది చేకూరేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, సీఎం కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com