TG : చెరువులు కబ్జా చేసిన ఎవరినీ వదిలిపెట్టం : సీఎం రేవంత్ రెడ్డి

X
By - Manikanta |28 Aug 2024 5:45 PM IST
జన్వాడలో కేటీఆర్ ఫామ్ హౌజ్‌పై సీఎం రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు. చెరువులు కబ్జా చేసిన ఎవరిని వదిలిపెట్టమన్నారు. రూల్స్ అతిక్రమించి కట్టిన ఫామ్ హౌస్‌ను కేటీఆర్ ఎలా లీజుకు తీసుకున్నారని ప్రశ్నించారు. ఫామ్ హౌజ్ లీజుకు తీసుకున్న విషయం.. కేటీఆర్ ఎన్నికల అఫిడవిట్లో చూపించారా అని అడిగారు. ఒకవేళ ఆఫిడవిట్లో చెప్పకపోతే న్యాయవిచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ప్రజాప్రతినిధులు ఆదర్శంగా ఉండాలని చెప్పారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో తన బంధువుల ఇళ్లుంటే తానే వాటిని దగ్గరుండి కూల్చేస్తానని సీఎం స్పష్టం చేశారు. ప్రస్తుతానికి హైదరాబాద్ వరకే హైడ్రా పరిమితమని తెలిపారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్, పార్కులు, నాలాలను కాపాడటమే తమ మొదటి ప్రాధాన్యమన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com