Revanth Reddy : కాంట్రాక్టు నియామకాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..

తెలంగాణలో కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన చోట మాత్రమే ఈ నియామకాలు చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోబోమని, అవసరాన్ని గుర్తించే బాధ్యత అధికారులదేనని సీఎం తేల్చి చెప్పారు.
కాగా ఉద్యోగుల నియామకలపై రిటైర్డ్ ఐఏఎస్ శాంతికుమారి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఏయే శాఖల్లో ఎంతమంది కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు? వారి నియామకాలకు ఆర్థిక శాఖ అనుమతి ఉందా?ఎంతమంది ఆధార్, బ్యాంక్ వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు? ఏయే శాఖల్లో పనిభారం ఎక్కువగా ఉంది? ఎక్కడ కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల అవసరం ఉంది?...ఈ అంశాలపై శాంతికుమారి కమిటీ నివేదికను తయారు చేస్తోంది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది
కాగా ఈ నియామకాలపై జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ, "ఎవరినీ తొలగించమని నేను చెప్పను, అలాగే ఎవరినీ తీసుకోవాలని కోరను. అవసరం ఉందో లేదో మీరే గుర్తించాలి" అని కమిటీకి సూచించారు. గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను నియమించారని, దీనివల్ల అవినీతికి ఆస్కారం ఏర్పడిందని అన్నారు. కొన్ని శాఖల్లో ఏజెన్సీలు, అధికారులు కుమ్మక్కై ఒకే వ్యక్తికి రెండు, మూడు చోట్ల జీతాలు చెల్లిస్తున్నారని, మరికొన్ని చోట్ల జీతాలు డ్రా చేస్తున్నా సిబ్బంది పనిచేయడం లేదని ఫిర్యాదులు అందాయని సీఎం అన్నారు. ఉద్యోగుల నియామకాల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని...ఇందుకు కమిటీ డే పూర్తి బాధ్యత అని సీఎం స్పష్టం చేసారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com