TG : తొక్కిసలాటలో సీఎం రేవంత్ ను అరెస్ట్ చేయాలి.. ఆర్ఎస్ ప్రవీణ్ డిమాండ్

సీఎం రేవంత్ రెడ్డి సభకు ప్లెక్సీలు కడుతూ మృతి చెందిన సంఘటన, సంధ్య థియేటర్ తొక్కిసలాట సంఘటనను వేరువేరుగా చూడవద్దని మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. తెలంగాణభవన్ లో ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ మెదక్ జిల్లా కొల్చారం మండలం కిష్టాపూర్ గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలు తీస్తుండగా షాక్ కొట్టి ఇద్దరు యువకులు మరణించిన ఘటనకు సంధ్య థియేటర్ సంఘటనకు సంబంధం ఉంద న్నారు. రెండు ప్రమా దాల్లో వేర్వేరు న్యాయాలు ఉండరాదని అన్నారు. సంధ్య థియేటర్ ఘటనకేసు కిష్టాపూర్ కేసుకు సంబంధించి సంఘటనకు ఒకే న్యాయం ఉండాలన్నారు. అల్లు అర్జున్ సంధ్యథియేటర్ కేసులో ముద్దాయి అయితే కిష్టాపూర్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి ముద్దాయి అవుతారని చెప్పారు. ఈ రెండుసంఘటనలు జాగ్రతలు తీసుకొకపోవడంతోనే జరిగాయన్నారు. ఈసంఘటనల్లో ముమ్మాటికీ స్థానిక పోలీసు వైఫల్యమే అని పేర్కొన్నారు. కానీ పోలీసులు తమకు తామే నింది తులుగా పేర్లు చేర్చుకుంటారా అని ప్రశ్నించారు. ఈ న్యాయ సూత్రం మేరకు మెద క్ ఘటనలో కూడా స్థానిక ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకులు, చివరికి సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అల్లు అర్జున్ మీద నమోదు చేసిన కేసును ఈసంఘటనలో కూడా అమలు చేయాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com