TG : వరంగల్ సమగ్రాభివృద్ధిపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్ : మంత్రి పొంగులేటి

TG : వరంగల్ సమగ్రాభివృద్ధిపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్ : మంత్రి పొంగులేటి
X

వరంగల్ సమగ్రాభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) ప్రత్యేక దృష్టిని సారించారని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ ను మరింత అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి పెట్టారని చెప్పారు. అందుకే తనను ఈ జిల్లాకు ఇన్చార్జిగా బాధ్యతలను అప్పగించారని, అందుకే వరంగల్ సమగ్ర అభివృద్ధికి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఎడ్యుకేషన్, హెల్త్ అనేవి రెండు కళ్ళలాంటివని పేర్కొన్నారు. నగర అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి నిధులను కేటాయిస్తున్నట్లు తెలిపారు. స్మార్ట్ సిటీ నిధులను కూడా విడుదలయ్యేందుకు కృషి చేస్తామన్నారు. వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన వాటికి నిధులను కేటాయిస్తామన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద ముప్పు నుండి ప్రజలను హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు, అధికారులు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కాపాడినందుకు మంత్రి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.

Tags

Next Story