CM Revanth Reddy : ధరణిపై బాగా స్టడీ చేయాలి : సీఎం రేవంత్

X
By - Manikanta |26 July 2024 8:34 PM IST
ధరణి సమస్యల పరిష్కారానికి మరింత లోతుగా అధ్యయనం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) ఆదేశించారు. ధరణిలో సమస్యలు, మార్పులు- చేర్పులపై శుక్రవారం సెక్రటేరియట్ లో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కేకే, జానారెడ్డి, అధికారులు హాజరయ్యారు. సవరణలపై కొత్త సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం చెప్పారు. మార్పులు - చేర్పులపై ప్రజాభిప్రాయం, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన వారి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలని అధికారులకు సూచించారు. వారి అభిప్రాయాలు, సూచనలు ఆధారంగా సమగ్ర చట్టం తీసుకురావాలన్నారు. అవసరమైతే ఈ అంశంపై అసెంబ్లీలో చర్చ పెడతామని తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com