CM Revanth : నేడు ప్రధానితో సీఎం రేవంత్ భేటీ

CM Revanth : నేడు ప్రధానితో సీఎం రేవంత్ భేటీ
X

ప్రధాని మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సమావేశం కానున్నారు. అపాయింట్‌మెంట్ అందడంతో రేవంత్ నిన్న రాత్రి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. చివరిసారి గతేడాది జులైలో ఆయన పీఎంతో భేటీ అయ్యారు. ఇటీవల జరిగిన SLBC ప్రమాదంపై మోదీ ఆరా తీసే అవకాశం ఉంది. అటు మూసీ సుందరీకరణ, శంషాబాద్ వరకు మెట్రోరైల్, RRR నిర్మాణం సహా విభజన చట్టంలోని పెండింగ్ పనులు, నిధులపై ప్రధానితో సీఎం చర్చించనున్నారు. పలు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం సాయంపై సీఎం విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ప్రధానితో భేటీ అనంతరం పలువురు కేంద్రమంత్రులను రేవంత్‌రెడ్డి కలిసే అవకాశముంది.

Tags

Next Story