CM Revanth : సర్పంచ్ ఎన్నికలపై సీఎం రేవంత్ ఇవాళ సమీక్ష

CM Revanth : సర్పంచ్ ఎన్నికలపై సీఎం రేవంత్ ఇవాళ సమీక్ష
X

పంచాయతీ రాజ్ శాఖపై సీఎం రేవంత్ ఇవాళ సమీక్ష నిర్వహించనున్నారు. ఆ శాఖలో పెండింగ్ జీతాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి చివరి వారంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. నేడు దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారా? ఏదైనా ప్రకటన చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక సరఫరా విధానంపై ఉన్నత స్థాయి అధ్యయన కమిటీని సీఎం రేవంత్ నియమించారు. వారం రోజుల్లో సమగ్ర విధివిధానాలతో నివేదిక అందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు సౌకర్యంగా ఇసుక విధానం ఉండాలన్నారు. తక్కువ ధరకే ఇసుక దక్కేలా అదే సమయంలో ప్రభుత్వానికి ఆదాయం పెరిగేలా చూడాలన్నారు. ఇసుక మాఫియాను అరికట్టేందుకు అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ అర్హుల గుర్తింపును ఫిబ్రవరి 2లోగా పూర్తి చేయాలని అధికారులను పంచాయతీ రాజ్ శాఖ ఆదేశించింది. లబ్ధిదారుల వివరాలను అదే రోజు సాయంత్రం 5గంటల లోపు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించింది. ఆ తర్వాత మార్పులు, చేర్పులకు అవకాశం ఉండదని పేర్కొంది. ఈ పథకం కింద భూమి లేని వ్యవసాయ కూలీలకు ప్రభుత్వం ఏడాదికి రూ. 12వేలు అందించనుంది. ఇప్పటికే తొలి విడతలో పలువురికి రూ. 6వేల చొప్పున జమ చేసింది.

Tags

Next Story