CM Revanth : మార్చి 16న జనగామకు సీఎం రేవంత్.. వరంగల్ కారిడార్ లో డెవలప్ మెంట్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్చి 16న జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి రానున్నారు. సీఎం రాక సందర్భంగా నియోజకవర్గంలో విస్తృత మైన ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది కాగా ఈ ఏడాదికాలంలోనే నియోజకవర్గ అభివృద్ధి కోసం 800 కోట్ల రూపాయల నిధులను తీసుకురావడం జరిగిందని మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శంకుస్థాపన చేయనున్న అభివృద్ధి పనులకు సంబంధించిన ఏర్పాట్లను సంబంధిత శాఖల అధికారులు త్వరితగతిన పూర్తి చేయాలని కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. గురువారం జనగామ జిల్లా కలెక్టరేట్లో ఈ నెల 16న రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో దాదాపు 800 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
దాదాపు 800 కోట్ల రూపా యలతో స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గానికి వివిధ అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయని, అందుకు సంబంధించిన వాటికి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకు స్థాపన కార్యక్రమం ఉంటుందన్నారు కడియం. నియోజకవర్గ కేంద్రంలో వంద పడకల ఆసుపత్రి, జఫర్ గడ్ మం డలం కోనాయిచలం గ్రామంలో యంగ్ ఇండియా సమీకృత రెసిడెన్షియల్ పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బంజారా భవన్, సమీకృత రెవెన్యూ డివిజన్ కార్యాలయ సముదాయం, విద్యుత్ డివిజన్ కార్యాలయం, 5 సబ్స్టేషన్లు, ఏడు మండలాల వారీగా ఎంపిక చేసిన గ్రామ పంచాయతీల్లో ఇందిరమ్మ ఇళ్లు, పంచాయతీరాజ్ శాఖ ద్వారా మంజూరైన రోడ్లకు, చిల్పూర్, వేలేరు మండలాల్లో ఎంపీడీవో కార్యాల యలకు, ఆయిల్ సీడ్ ప్రాసెసింగ్ యూనిట్, బంజారా భవన్, ఐటీడీఏ రోడ్ పనులకు శంకుస్థాపనలు చేయనున్నారని, అలాగే స్టేషన్ ఘనపూర్ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీగా ప్రకటించనుననారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com