CM Revanth Reddy : డ్రైవర్ లెస్ కారులో ప్రయాణించిన సీఎం రేవంత్

CM Revanth Reddy : డ్రైవర్ లెస్ కారులో ప్రయాణించిన సీఎం రేవంత్
X

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా తొలి అధికారిక పర్యటన సక్సెస్ ఫుల్ గా ముగిసింది. ఆశించిన మేర విదేశీ పెట్టుబడులను ఆకర్శించడంలో ఆయన విజయవంతం అయ్యారని విశ్లేషకులు భావిస్తున్నారు. అతిపెద్ద అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలతో సంప్రదింపులు జరిపి భారీస్థాయిలో పెట్టుబడులను తెలంగాణకు రప్పించడంలో ముందడుగు వేసినట్టు సమాచారం.

శాన్ ప్రాన్సిస్కోలోని వైమో నగరంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు డ్రైవర్ లెస్ కారులో ప్రయాణించారు. ఈ వాహనాల డెమోను కూడా వీక్షించారు. కారులో ముందు వైపు రేవంత్ కూర్చున్నారు. వెనుకవైపు శ్రీధర్ బాబు కూర్చున్నారు. డ్రైవర్ సీటులో ఎవరూ లేరు. ఆ కారు అలా.. రెండువైపులా వాహనాలు తిరిగే రోడ్డుపై ప్రయాణించింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా డ్రైవర్ లెస్ కారు గమ్యాన్ని చేరింది. మరోవైపు.. డ్రైవర్ లెస్ కార్ల భారీ ర్యాలీ కూడా జరిగింది. దాన్ని కూడా రేవంత్ ఆసక్తిగా గమనించారు. ఈ కార్లలోని టెక్నాలజీని రేవంత్ అభినందించారు.

అమెరికాలో 8 రోజులపాటు సాగిన పర్యటనలో 50కి పైగా వ్యాపార సమావేశాలు, 3 రౌండ్ టేబుల్ సమావేశాలు, అనేక క్షేత్రస్థాయి విజిట్లతో నిజమైన కార్పొరేట్ గా బిజీబిజీగా గడిపారు. ఈ పర్యటనలో రూ.31,532 కోట్ల పెట్టుబడులతో 19 పెట్టుబడి ఒప్పందాలు, ఎంవోయూలు కుదుర్చుకు న్నారు. రాష్ట్రానికి ఈ కొత్త ఒప్పందాలతో 30,750 ఉద్యోగాలు కల్పించనున్నారు. హైదరాబాద్ 4.0 సిటీగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న వివిధ ప్రాజెక్టులకు భారీ స్పందన లభించింది. ఈ పర్యటనలో దాదాపు 19 కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు అవగాహన ఒప్పందాలు కుదిరాయి.

Tags

Next Story