TG : ఢిల్లీకి సీఎం రేవంత్.. ఈసారి పెద్ద అజెండా

TG : ఢిల్లీకి సీఎం రేవంత్.. ఈసారి పెద్ద అజెండా
X

సాయంత్రం ఢిల్లీకి వెళుతున్నారు తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి. ఢిల్లీలో రేపు జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు. ప్రధానంగా మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలపై ఈ మీటింగ్ లో చర్చించనున్నారని సమాచారం. ఈ సందర్భంగా AICC అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక, మల్లికార్జున ఖర్గేను సీఎం రేవంత్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కలిసే అవకాశం ఉంది. ఈ భేటీలో మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపుపై అగ్రనేతలు ఫోకస్ పెట్టడంతో మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదోనని ఆశావహులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags

Next Story