TG : తెలంగాణ తల్లి విగ్రహ నమూనా మారిస్తే చట్టపరమైన చర్యలు: సీఎం రేవంత్

TG : తెలంగాణ తల్లి విగ్రహ నమూనా మారిస్తే చట్టపరమైన చర్యలు: సీఎం రేవంత్
X

డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సీఎం రేవంత్ తెలిపారు. ‘భవిష్యత్తులో విగ్రహ నమూనా మార్చాలన్నా, ఈ కార్యక్రమాన్ని ఎవరైనా అవమానించాలని చూసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష మేరకే ఈ నిర్ణయం తీసుకున్నాం. విగ్రహం మార్పు వల్ల తమ భవిష్యత్తు అంధకారం అవుతుందని కొందరు భయపడుతున్నారు’ అని రేవంత్ విమర్శించారు.

ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష కోసం ఆనాడు పార్టీలు పోరాటం చేశాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘ఆలె నరేంద్ర, విజయశాంతి, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లాంటి వారు తమ రాజకీయ పార్టీల ఆలోచన, విధివిధానాలకు అనుగుణంగా తెలంగాణ తల్లి ప్రతిమను సృష్టించుకుని ముందుకు కొనసాగాయి. కానీ 2014లో జూన్ 2న రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాన్ని గత పాలకులు నిర్వహించలేదు’ అని సీఎం విమర్శించారు.

Tags

Next Story