Telangana : మళ్లీ తగ్గిన చలి.. తెలంగాణలో పలుచోట్ల హైఅలర్ట్

తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో చలి తీవ్రత భారీగా పెరిగిపోయింది. ఉదయం 8 కావొస్తున్నా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే వణికిపోతున్నారు. చలికి తోడు దట్టమైన పొగమంచు కురుస్తుండటంతో.. రోడ్లపై వెళ్లే వాహనాలు సరిగా కనిపించడం లేదు. దీంతో నగరంలోని చాలా రహదారులు ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో తెల్లవారుజామున 9 గంటలు అవుతున్నా మంచు దుప్పట్లు వదలక పోవడంతో దూరప్రాంతాలకు వెళ్లే.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణలోని అటవీ ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలైతే.. ఉదయం 10 గంటలు దాటితే తప్ప ఇంట్లో నుంచి బయటకు రావడం లేదు. చలి తీవ్రత పెరగడంతో గ్రామాల్లో ఎక్కడ చూసినా రోడ్ల వెంట చలిమంటలు దర్శనమిస్తున్నాయి.
ఈ రోజు అత్యల్పంగా.. పటాన్‌చెరులో 13.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. మరికొద్ది రోజుల్లో సంక్రాంతి పండుగా రానుంది. ఈ పండుగ అనంతరం చలి తీవ్రత కొంచెం కొంచెంగా తగ్గనుంది. దీంతో అప్పటి వరకు గుండె, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు ఉన్నవారు.. జాగ్రత్తలు పాటించాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com