TG : తెలంగాణలో మళ్లీ పెరిగిన చలి.. ఈ జిల్లాల్లో జాగ్రత్త

TG : తెలంగాణలో మళ్లీ పెరిగిన చలి.. ఈ జిల్లాల్లో జాగ్రత్త
X

తెలంగాణలో చలి తీవ్రత భారీగా పెరిగిపోయింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని మంచు దుప్పటి కప్పేసింది. ఉదయం 8 గంటలైనా పొగమంచు ఏమాత్రం వీడలేదు. అర్దరాత్రి నుంచి భారీగా మంచు కురుస్తోంది. నవంబర్ నెల నుంచే చలి తీవ్రత పెరగడం ప్రారంభమైనా పొంగమంచు పెద్దగా కనిపించలేదు. ఆదివారం మాత్రం పొగమంచు భారీగా కురిసింది. మరోవైపు నేడు తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. చలి తీవ్రత మరింత పెరుగుతుందని చెప్పింది. అయినా మేఘాలు తక్కువగానే ఉంటాయని వెల్లడించింది. అలాగే నేడు తెలంగాణలో పొగమంచు బాగా పెరిగి ఉదయం, సాయంత్రం భారీగా కురుస్తుందని పేర్కొంది. పగటిపూట మెుత్తం ఎండ ఉన్నప్పటికీ ఉదయం, రాత్రి వేళ చలి తీవ్రత పెరుగుతుందని ఐఎండీ తెలిపింది. తెలంగాణలో గంటకు 9 కి.మీ. వేగంతో వీస్తాయని వెల్లడించింది. మరోవైపు బంగాళాఖాతంలో గంటకు 31కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నట్లు పేర్కొంది. అయితే శ్రీలంక తూర్పు వైపు అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో గాలులన్నీ అటు వైపు మళ్లుతున్నట్లు తెలిపింది. తెలంగాణలో పగటి వేళ 29 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని అంచనా వేసింది. తెలంగాణలో గాలుల్లో తేమ 40 నుంచి 50 శాతంగా ఉంటుందని వెల్లడించింది. అయితే పొగమంచు, చలి తీవ్రత కారణంగా ప్రజలు రాత్రి వేళ జాగ్రత్తలు పాటించాలని భారత వాతావరణ శాఖ సూచించింది.

Tags

Next Story