Telangana : పదిరోజుల్లో మరింత పెరగనున్న చలి.. జాగ్రత్త

Telangana : పదిరోజుల్లో మరింత పెరగనున్న చలి.. జాగ్రత్త
X

రానున్న రోజుల్లో రాష్ట్రంలో చలితీవ్రత మరింత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న రెండు రోజులు రాష్ట్రంలో పొడివాతావరణం నెలకొంటుందని తెలిపింది. రాష్ట్రంలో శనివారం, ఆదివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈనెల 28వ తేదీ నుండి వచ్చే నెల జనవరి 2వ తేదీ వరకు రాష్ట్రంలో పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో బుధ, గురువారాల్లో చిరు జల్లులు కురువగా శుక్రవారం నాటి నుంచి పొడివాతావరణం నెలకొంది. రాబోయే అయిదు రోజులపాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉదయం వేళల్లో పొగమంచు కురిసే అవకాశం ఉందని, అదే సమయంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్ నుండి 4 డిగ్రీల సెల్సియస్ వరకు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు తూర్పు, ఆగ్నేయ దిశల నుండి ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది.

Tags

Next Story