Accident : నిలిపి ఉన్నలారీని ఢీకొట్టిన మరో లారీ.. ఇద్దరు మృతి

Accident : నిలిపి ఉన్నలారీని ఢీకొట్టిన మరో లారీ.. ఇద్దరు మృతి
X

సంగారెడ్డి జిల్లాలో రెండు లారీలు ఢీ కొన్నాయి. ఈఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. సంగారెడ్డి జిల్లా సదాశివపేట జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఘట్‌కేసర్‌ నుంచి మహారాష్ట్ర వెళ్తున్న లారీ టైర్‌ పంచర్‌ కావడంతో రోడ్డుపక్కన నిలిపారు. వెనక నుండి వేగంగా వచ్చిన మరోలారి ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story