Siricilla : లిఫ్ట్ పడి కమాండెంట్ దుర్మరణం

Siricilla : లిఫ్ట్ పడి కమాండెంట్ దుర్మరణం
X

ప్రమాదవశాత్తు లిఫ్ట్ పడి 17వ బెటాలియన్ కమాండెంట్ మృతిచెందాడు. ఈ ఘటన సిరిసిల్ల పట్టణంలో జరిగింది. ఇటీవల సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్రెడ్డి కుటుంబీకులు మరణించగా కమాండెంట్ తోట గంగారాం రాత్రి వారిని పరామర్శించేందుకు వెళ్లారు. అపార్టుమెంట్ లో లిఫ్ట్ రాకముందే గేటు తీసి ముందుకు వెళ్లడంతో మూడో ఫ్లోర్ నుంచి మొదటి ఫ్లోర్ లో ఉన్న లిఫ్ట్ పై పడిపోయాడు. వెంటనే ఫైర్ సిబ్బంది అతడిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా గంగారాం అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సిద్దులం గ్రామానికి చెందిన గంగారాం.. సిరిసిల్ల 17వ బెటాలియన్ కమాండెంట్ గా మూడు నెలల కిందటే బాధ్యతలు స్వీకరించారు. గంగారాం గతంలో రాష్ట్ర సచివాలయం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా కూడా పని చేశారు.

Tags

Next Story