Amrapali : లక్ష్యం మేరకు ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయాలి: ఆమ్రపాలి

లక్ష్యం మేరకు ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు కు చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆమ్రపాలి ( Amrapali Kata ) తెలిపారు. శుక్రవారం జోనల్ అడిషనల్ కమిషనర్ లతో ఆమె టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ... సి ఆర్ ఎం పి ద్వారా చేపట్టిన రోడ్లకు సంబంధించిన ఏజెన్సీ లతో చేసుకున్న అగ్రిమెంట్ డిసెంబర్ వరకు గడువు ఉన్నందున పెండింగ్ లో ఉన్న మెయింటెనెన్స్ పనులు వెంటనే పూర్తి చేయించాలని జోనల్ కమిషనర్లను ఆదేశించారు. ఏజెన్సీ ఒప్పందం లో ఉన్న అంశాలకు పెండింగ్ పనులను పూర్తి చేయాలని తెలిపారు. అవసరమైతే ఏజెన్సీ లతో జోనల్ స్థాయిలో సమీక్ష చేసి ఒప్పందం చేసుకున్నవిధంగా ఏమైనా గ్యాప్ ఉంటే వెంటనే పనులు చేయించాలని తెలిపారు. డెంగ్యూ వ్యాధి నియంత్రణకు చేపట్టిన అవగాహన కార్యక్రమాలు మరింత ముమ్మరంగా చేపట్టాలని తెలిపారు. దోమల తో వచ్చే వ్యాధులతో పాటుగా ఈగల ద్వారా వచ్చే వ్యాధుల పై కూడా అవగాహన కల్పించాలని తెలిపారు. పరిసరాల పరిశుభ్రత పై నగర వాసులు దృష్టి సారించాలని సూచించారు.కమ్యూనిటీ హాల్స్ వివరాలు సర్కిల్ వారీగా పూర్తి నివేదిక సమర్పించాలని కమిషనర్ ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com