KTR : కేటీఆర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన సామా రామ్మోహన్‌రెడ్డి

మాజీ మంత్రి కేటీఆర్‌పై హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌లో టీపీసీసీ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ చైర్మన్ సామా రామ్మోహన్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. మూసీ నది ప్రక్షాళన విషయంలో సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మూసీ ప్రక్షాళనకు 1 లక్ష 50 వేల కోట్ల రూపాయలు కేటాయించారని, అందులో 25 వేల కోట్లు ఢిల్లీ పెద్దలకు దోచి పెట్టేందుకే ప్రణాళిక చేశారని సీఎంతో పాటు కాంగ్రెస్ హైకమాండ్‌పైనా తప్పుడు ఆరోపణలు చేశారని, కేటీఆర్‌పై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా మూసీ ప్రక్షాళనలో భాగంగా అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు తొలగిస్తున్న విషయం తెలిసిందే. మూసీ వెంట సర్వే మార్కులు వేసి మరి కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి భరోసా కల్పించేందుకు మూసీ పరివాహక ప్రాంతానికి వెళ్తున్న కేటీఆర్‌ను కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ పరిణామంతో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర విమర్శలు కురిపించారు. దీంతో కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని టీపీసీసీ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com