Smita Sabharwal : స్మితా సబర్వాల్‌పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

Smita Sabharwal : స్మితా సబర్వాల్‌పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
X

సివిల్స్‌లో దివ్యాంగుల కోటాపై IAS స్మితా సబర్వాల్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆమె వ్యాఖ్యలు వికలాంగులను అగౌరవపరిచేలా ఉన్నాయంటూ వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌​లో ఫిర్యాదు చేశారు. దివ్యాంగుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడిన సబర్వాల్‌పై చర్యలు తీసుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్‌లలో, మానవ హక్కుల కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తామని అన్నారు. దివ్యాంగులు ఐఏఎస్‌కు పనికిరారని వారికి శారీరకంగా పని చేయలేరని, ఫీల్డ్ విజిట్ చేయలేరని చేసిన కామెంట్స్ ఆమె అహంకారానికి నిదర్శనమన్నారు. దివ్యాంగుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడిన స్మితా సబర్వాల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Tags

Next Story