TG : రేవంత్ ప్రజాపాలనపై కామ్రేడ్ల సెటైర్లు

TG : రేవంత్ ప్రజాపాలనపై కామ్రేడ్ల సెటైర్లు
X

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మిత్రపక్షం సీపీఐ నేతలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజా పాలన అప్లికేషన్ సిస్టమ్ ఫెయిలైందన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు ఫోన్ చేసినా మంత్రులు ఫోన్ ఎత్తడం లేదన్నారు. అధికారుల తీరు అలాగే ఉందన్నారు. ఇనుప కంచెలు కూల్చి ప్రారంభించిన ప్రజావాణి నవ్వులాటలా మారిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు కూనంనేని. కామ్రేడ్ల కామెంట్లపై కాంగ్రెస్ లో చర్చ జరుగుతోంది.

Tags

Next Story