Kishan Reddy : మంత్రుల కమీషన్లపై విచారణ చేయించండి : కిషన్ రెడ్డి

Kishan Reddy : మంత్రుల కమీషన్లపై విచారణ చేయించండి : కిషన్ రెడ్డి
X

మంత్రులు కమీషన్లు తీసుకుంటున్నారని కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి స్పందించారు. నాంపల్లిలోని పార్టీ స్టేట్ ఆఫీసులో ఆయన మాట్లాడుతూ 'మంత్రులు కమీషన్లు తీసుకుంటున్నారని స్వయంగా ఒప్పుకున్నారు. ఈవిషయంలో ఎవరు ఎంత కమీషన్ తీసుకున్నారో దర్యాప్తు చేయించాలి' అని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. మంత్రులు తీసుకున్న కమీషన్ల వివరాలూ బయటపెట్టాలని కోరారు. ఆపరేషన్ సిందూరు తాత్కాలిక బ్రేక్ మాత్రమే ఇచ్చామని తెలిపారు. భారత పై దాడి చేస్తే ప్రతీకారం ఎలా ఉంటుందో చూపించామని చెప్పారు. సైనికులకు సంఘీభావంగా రేపు ట్యాంక్ బండ్ పై తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. రాజకీయాలకు అతీతంగా ఈ కా ర్యక్రమం చేపడుతున్నామని.. అన్ని పార్టీలను, ఎమ్మెల్యేలను, ఎంపీలను ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు.

ఏప్రిల్ 22న జమ్ము కశ్మీర్‌లోని పెహల్గామ్‌లో పర్యాటకులపై పాకిస్థాన్ ప్రేరిత ఉగ్రవాదులు అత్యంత క్రూరంగా 26 మందిని కాల్చి చంపేశారు. మృతుల్లో 25 మంది భారతీయులు, మరొకరు నేపాల్ నుంచి వచ్చిన టూరిస్ట్ ఉన్నారు. ఈ ఉగ్రదాడి మానవత్వానికి సవాలుగా నిలిచింది. పిల్లల ముందు తండ్రిని, భార్యల ముందు భర్తలను అత్యంత క్రూరంగా హత్య చేసిన ఘటన ప్రపంచంలో తొలిసారి జరిగింది. పెహల్గామ్ ఘటనను యావత్‌ దేశంతో పాటు అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండించింది.

Tags

Next Story