TG : స్కూల్ బస్సుల ఫిట్‌నెస్ తనిఖీలు చేయండి: మంత్రి పొన్నం

TG : స్కూల్ బస్సుల ఫిట్‌నెస్ తనిఖీలు చేయండి: మంత్రి పొన్నం

పాఠశాలల బస్సుల ఫిట్‌నెస్‌పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ( Ponnam Prabhakar ) అధికారులను ఆదేశించారు. ప్రతి స్కూల్ బస్సు తనిఖీ చేసి, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఉంటేనే రోడ్డు ఎక్కేలా చూడాలని రవాణాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షలో సూచించారు. స్కూళ్లు, కాలేజీల్లో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కారు డోర్లకు బ్లాక్ ఫిల్మ్ గ్లాస్ ఉన్న వాటిపైనా తనిఖీలు నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు.

‘‘కారు డోర్‌లకు బ్లాక్‌ ఫిల్మ్‌ గ్లాస్‌ ఉన్న వాటిపై విధిగా తనిఖీలు నిర్వహించాలి. రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద ఉన్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను మరింత బలోపేతం చేస్తే అవినీతికి ఆస్కారం లేకుండా ఆదాయం పెంచుకోవచ్చు. సీజ్‌ చేసిన వాహనాలకు సంబంధించి పాలసీలో ఉన్న విధంగా వ్యవహరించాలి. వాహనాలను భద్రపర్చే ప్రదేశాలపై జిల్లా పోలీస్‌ అధికారులతో కో-ఆర్డినేట్‌ చేసుకోవాలి. హైదరాబాద్‌లో ఆటోరిక్షాలపై ప్రస్తుతం ఉన్న పాలసీతో పాటు సీఎన్జీ, ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించేలా రూపొందించాలి’’ అని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Tags

Next Story