Congress BC Leaders : గవర్నర్ ను కలవనున్న కాంగ్రెస్ బీసీ నేతలు

X
By - Manikanta |2 May 2025 4:00 PM IST
తెలంగాణ ప్రభుత్వం బీసీలకు రాజకీయ, విద్యా ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకొచ్చిన బిల్లుకు ఆమోదం తెలిపి నందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసి తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలు కృతజ్ఞతలు తెలుపనున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలు, మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్, కే. కేశవరావు, మధు యాష్కి మాజీ ఎంపీలు వీహెచ్, అంజన్ కుమార్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, విజయశాంతి, నారాయణ, ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, బిర్ల ఐలయ్య తదితరులు పాల్గొననున్నారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com