Bandi Sanjay : ముస్లి రిజర్వేషన్ల కోసమే కాంగ్రెస్ ఆందోళనలు

ముస్లిం రిజర్వేషన్ల కోసమే ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నా చేస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అరోపించారు. కాంగ్రెస్‌ది కామారెడ్డి డిక్లరేషన్ కాదు.. ముమ్మాటికీ ముస్లిం డిక్లరేషనే అని విమర్శించారు. బీసీలకు 5శాతం పెంచి.. ముస్లింలకు అదనంగా 10 శాతం రిజర్వేషన్లు కల్పించే కుట్ర జరుగుతుందని అన్నారు. బీసీ ముసుగులో ముస్లింలకు 100శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని ప్లాన్ వేస్తున్నట్లు ఆరోపించారు. ముస్లింలను తీసేసి.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తేనే మద్దతిస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు. బీసీలకు ఏ పార్టీ ఏం చేసిందో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.
50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎప్పుడైనా బీసీని ప్రధానిని చేశారా అని సంజయ్ ప్రశ్నించారు. బీసీ వ్యక్తిని ప్రధానిని చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందని అన్నారు. 27 మంది బీసీ కేంద్ర మంత్రులను, అనేక రాష్ట్రాలకు బీసీ సీఎంలను నియమించినట్లు తెలిపారు. రాష్ట్ర కేబినెట్‌లో, నామినేటెడ్ పదవులను ఎంతమంది బీసీలకు ఇచ్చారో కాంగ్రెస్ చెప్పాలని నిలదీశారు. బీసీల గురించి కాంగ్రెస్ మాట్లాడడం సిగ్గుచేటుగా ఉందన్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com