ఆ 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు తంటాలు..

ఆ 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు తంటాలు..
X

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ ఎన్నికల్లో కచ్చితంగా మెజార్టీ సీట్లు సాధించేందుకు అన్ని పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి అయితే కాంగ్రెస్ పార్టీకి మాత్రం 10 నియోజకవర్గాల్లో పెద్ద తంటాలు వచ్చినట్టు తెలుస్తోంది. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కుంటున్న 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో మున్సిపల్ ఎన్నికలు టాస్క్ గా మారాయి. ఎందుకంటే ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిన మాజీలు, ప్రస్తుత ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. పైగా ఇప్పుడు స్పీకర్ ఏడుగురికి క్లీన్ చిట్ ఇచ్చారు. ఇంకో ముగ్గురి విచారణ మిగిలి ఉంది. కాబట్టి వీరు కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తే లీగల్ గా చిక్కులు వస్తాయని.. కాబట్టి తామే అంతా చూసుకుంటాం అని కాంగ్రెస్ లో పాత లీడర్లు చెబుతున్నారు. లేదు లేదు.. మేం చెప్పిన వారికే టికెట్లు ఇవ్వండి.. మేం గెలిపించుకుంటాం అని పది మంది ఎమ్మెల్యేలు చెబుతున్నారంట.

మొత్తంగా ఈ పది నియోజకవర్గాల్లో పాత వర్సెస్ కొత్త అన్నట్టు ఆధిపత్య రాజకీయాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ నేతల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. పార్టీలో చేరలేదని ఏడుగురికి క్లీన్ చిట్ ఇవ్వడం వల్ల.. వారు పార్టీ వారు కాదని.. కాబట్టి తమకే ప్రియారిటీ ఉండాలంటూ పాత నేతలు పట్టుబడుతున్నారు. తమ అనుచరులకే టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ పది మంది ఎమ్మెల్యేలు తమ వర్గానికే టికెట్లు ఇవ్వాలని అగ్ర నేతల మీద ఒత్తిడి తీసుకువస్తున్నారు. దీంతో ఈ నియోజకవర్గాల్లో ఎన్నికలు అధినేతలకు తలనొప్పిగా మారాయంట.

ఎవరికి నచ్చజెప్పినా వర్కౌట్ కావట్లేదని మంత్రులు వాపోతున్నారు. ఇదే విషయం మీద పార్టీ అధిష్టానం దాకా పంచాయితీలు వెళ్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ పది నియోజకవర్గాల్లో ఎవరికి కీలక బాధ్యతలు అప్పగించాలి అనేది పెద్ద చర్చగా మారింది. అన్ని నియోజకవర్గాల్లో పరిస్థితులు ఒకలా ఉంటే.. ఈ పది చోట్ల మాత్రం ఇంకోలా ఉన్నాయని అంటున్నారు నేతలు. మరి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది.. ఎవరిని పక్కన పెడుతుందనేది చూడాలి.

Tags

Next Story