TG : బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ : పాయల్ శంకర్

TG : బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ : పాయల్ శంకర్
X

కాంగ్రెస్ బడ్జెట్ లెక్కలు గారడిలాగ ఉన్నాయని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు. అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. అందమైన పెద్ద పెద్ద పదాలు, అంకెలతో బడ్జెట్‌ను తయారు చేశారని సెటైర్ వేశారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పేరు ప్రస్తావించలేదని అంటున్న కాంగ్రెస్.. రాష్ట్ర బడ్జెట్లో ఎన్ని జిల్లాల పేర్లు ప్రస్తావించారని ప్రశ్నించారు. అనవసరంగా కేంద్రంతో గొడవలు పెట్టుకుని వచ్చే నిధులు కూడా రాకుండా చేసుకోవద్దని సూచించారు. బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ సైతం భూములు అమ్మేందుకు సిద్ధమైందని ఆరోపించారు. రైతు రుణమాఫీకి అవసరమయ్యే 31 వేల కోట్లకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ క్లారిటీ ఇవ్వలేదన్నారు.

Tags

Next Story