తెలంగాణపై కాంగ్రెస్ ఫుల్ ఫోకస్..

వచ్చే ఎన్నికల్లో విజయమే లక్షంగా తెలంగాణపై కాంగ్రెస్ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.ఓవైపు చేరికలు మరోవైపు సభలతో కాంగ్రెస్‌లో జోష్ నెలకొంది. ఈనెల 20న తెలంగాణకు ప్రియాంకగాంధీ రానున్నారు.కొల్లాపూర్‌లో జరిగే కాంగ్రెస్ భారీ బహిరంగ సభకు ప్రియాంకగాంధీ ముఖ్య అతిథిగా హాజరవుతారని టీ.కాంగ్రెస్ నేతలు తెలిపారు. అటు కొల్లాపూర్ బహిరంగ సభకు భారీ జనసమీరణ దిశగా హస్తం నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. కొల్లాపూర్ సభా వేదికగా 20న ప్రియాంకగాంధీ సమక్షంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కూచుమళ్ల దామోదర్‌రెడ్డి.. ఆయన కుమారుడుతో పాటు భారీగా నేతల చేరికలు ఉంటాయని హస్తం నాయకులు అంటున్నారు. దీంతో కొల్లపూర్ సభకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఖమ్మం సభకు ధీటుగా కొల్లాపూర్ సభ ఉండేలా జూపల్లితో పాటు కాంగ్రెస్ నేతలు కసరత్తు చేస్తున్నారు. సభా ఏర్పాట్లపై నిన్న ఉమ్మడి పాలమూరు జిల్లా నేతల భేటీ కాగా ఇవాళ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీమంత్రి జానారెడ్డిలతో జూపల్లి వరుస సమావేశాలు హీట్ పుట్టిస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com