KTR : మోసాల్లో కాంగ్రెస్ హిస్టరీ.. కేటీఆర్ విమర్శలు

కాంగ్రెస్ పాలన కొత్త సీసాలో పాత సారాలాగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఆరోగ్యశ్రీ అంటే వైఎస్సార్, రైతుబంధు అంటే కేసీఆర్ గుర్తొస్తారని అన్నారు. మోసం చేయడంలో కాంగ్రెస్ నేతలు చరిత్ర సృష్టించారని ఎద్దేవా చేశారు. నల్గొండ పట్టణం క్లాక్ టవర్ చౌరస్తా లో జరిగిన రైతు మహాధర్నాలో కేటీఆర్ మాట్లాడారు. 'కేసీఆర్ 12సార్లు రైతుబంధు ఇచ్చారు కానీ ఇలా ప్రచారం చేసుకోలేదు. రుణమాఫీ, రైతుబంధు, వరికి బోనస్ అన్నింటిలో మోసాలే. పంజాబ్, హర్యానా తలదన్నేలా వరి పండించడంలో తెలంగాణను కేసీఆర్ నెంబర్ వన్ చేశారు. జనవరి 26నే రైతు భరోసా ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. కేసీఆర్ రైతు బంధు కింద 73 వేల కోట్లు ఇచ్చారు. రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారు. ఏ ఊర్లో అయినా వంద శాతం రుణమాఫీ జరిగిందని చూపిస్తే రాజకీయ సన్యాసం చేస్త. గ్రామ సభల్లో హామీల అమలుపై జనాలు నిలదీస్తున్నారు. నల్గొండ ఐటీ టవర్ కళ తప్పింది. కోమటిరెడ్డి వచ్చాక అది తాగుబోతులకు అడ్డాగా మారిందేమో ! దర ఖాస్తుల వ్యాపారంతో రాష్ట్రంలో జిరాక్స్ సెంటర్ల నిర్వాహకులు మాత్రమే సంతోషంగా ఉన్నరు' అని కేటీఆర్ సెటైర్ వేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com