పంచాయతీ ఎన్నికలపై కాంగ్రెస్ గురి.. సరికొత్త ప్లాన్

పంచాయతీ ఎన్నికలపై కాంగ్రెస్ గురి.. సరికొత్త ప్లాన్
X

తెలంగాణ పల్లెల్లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలపై కాంగ్రెస్ గట్టిగా పోరాడుతున్నట్టు కనిపిస్తోంది. మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏ స్థాయిలో అయితే అందరూ కలిసికట్టుగా పనిచేశారో అదే స్థాయిలో పల్లెల్లో ఎమ్మెల్యేలు రిజల్ట్ తీసుకురావాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రతి ఎమ్మెల్యేకు టార్గెట్లు కూడా ఫిక్స్ చేశారు. అందుకే ఎమ్మెల్యేలతో పాటు లోకల్ లీడర్లు కూడా పల్లెల్లోనే మకాం వేసి అక్కడే ఉంటున్నారు. గ్రామాల్లో పార్టీ తరఫున ఒకే అభ్యర్థి నిలబడేలా ప్లాన్ చేస్తున్నారు. ఇద్దరు ముగ్గురు నిలబడితే పార్టీకి మైనస్ కాబట్టి అలా జరగకుండా ఒప్పిస్తున్నారు. వీరికి తోడు ఇప్పుడు కొత్తగా డిసిసి అధ్యక్షులు కూడా తోడయ్యారు.

కొత్తగా పదవులు వచ్చినవారు ఎలాగూ హుషారుగా పనిచేస్తారని తెలిసిందే కదా. అందుకే డిసిసి అధ్యక్షులు కూడా గ్రామాల్లో తిరుగుతూ కాంగ్రెస్ పథకాలను వివరిస్తూ తమ అభ్యర్థులకు ఓట్లు వేసేల ప్రత్యేక హామీలు కూడా ఇప్పిస్తున్నారు. సరిగా పనిచేయని డిసిసి అధ్యక్షులు పదవులు పోతాయని ఇప్పటికే మీనాక్షి నటరాజన్ తేల్చి చెప్పారు. ఆమె ఆదేశాలతో డిసిసి అధ్యక్షులు బాగానే కష్టపడుతున్నారు.

సర్పంచ్ ఎన్నికలను కాంగ్రెస్ తీసుకున్నంత సీరియస్ గా బిఆర్ఎస్ పార్టీ బిజెపి పార్టీలు తీసుకోవట్లేదని తెలుస్తోంది. అందుకే కేటీఆర్ ఈ ఎన్నికలపై పెద్దగా రెస్పాండ్ కావట్లేదు. లోకల్ గా ఉన్న పార్టీ జిల్లాల అధ్యక్షులకే బాధ్యతలు వదిలేసి ఊరుకున్నారు. బిఆర్ఎస్ నుంచి ఇద్దరు ముగ్గురు ఒకే గ్రామంలో పోటీ చేస్తున్నా సరే ఎవరూ పెద్దగా పట్టించుకోవట్లేదు. ఎవరు గెలిచినా మనవాళ్లే కదా అన్నట్టు లైట్ తీసుకుంటున్నారు. అటు బిజెపికి లోకల్ గా పెద్దగా అభ్యర్థులు కూడా లేరు. అందుకే ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎక్కడా కనిపించట్లేదు. ఇదే అదునుగా కాంగ్రెస్ పట్టు బిగించేందుకు సిద్ధమవుతోంది. మరి కాంగ్రెస్ ఆశించినట్టు ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చూద్దాం మరి ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో.


Tags

Next Story