హీటెక్కిన హుజూరాబాద్ పాలిటిక్స్.. టీఆర్ఎస్‌లోకి కాంగ్రెస్ నేత..!

రోజురోజుకీ హుజూరాబాద్ పాలిటిక్స్ రంజుగామారుతున్నాయి. రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజీనామాతో జరగనున్న ఈ ఉపఎన్నికను అన్ని పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పొలిటికల్ హీట్ పీక్ స్జేట్‌కి చేరింది...గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరబోతున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. రేపు తన అనుచరులతో నియోజకవర్గంలో సమావేశాలు నిర్వహిస్తున్నారు కౌశిక్ రెడ్డి. వారి అభిప్రాయం మేరకు ఓ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.
కొన్ని రోజుల క్రితం కౌశిక్‌రెడ్డి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. అప్పుడే పార్టీ మారుతున్నారనే ప్రచారం జోరుగా సాగింది. వెంటనే తేరుకున్న కౌశిక్ రెడ్డి, తాను టీఆర్ఎస్‌లోచేరడం లేదని వివరణ ఇచ్చారు.. ఒక కార్యక్రమంలో కేటీఆర్‌ను కలిశానని దానికి రాజకీయ ప్రాముఖ్యత లేదని కొట్టిపారేశారు. అయితే గతంలో పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి ..కౌశిక్ రెడ్డి బంధవువు కావడం వల్లే ఆయనకు అప్పట్లో కాంగ్రెస్ టికెట్ ఇచ్చారనే ప్రచారం ఉంది.. కానీ ఇప్పుడు కొత్తగా పీసీసీ పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డి కౌశిక్ రెడ్డికి టికెట్ ఇవ్వడంపై అంత సుముఖంగా లేనట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com