TG : స్థానిక ఎన్నికల వేళ బీజేపీలోకి కాంగ్రెస్ నేతల వలస

TG : స్థానిక ఎన్నికల వేళ బీజేపీలోకి కాంగ్రెస్ నేతల వలస
X

ఢిల్లీలో ఎంపీ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ నివాసంలో మహబూబ్ నగర్ కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరారు. అరుణ సమక్షంలో పలువురు కాంగ్రెస్ నేతలు కాషాయ కండువా కప్పు కున్నారు. కాంగ్రెస్ పార్టీ సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షులు సభావత్ శ్రీనివాస్ నాయక్, మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేసిన అభ్యర్థి సభావత్ విజయ బీజేపీలో చేరారు. కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాలకు ఆకర్షితులై బీజేపీలో చేరడం సంతోషకరమని ఈ సందర్భంగా ఆమె అన్నారు. కష్టపడి పనిచేస్తే పార్టీలో తప్పక గుర్తింపు ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపి సీతారాంనాయక్, ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కళ్యాణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. చిలుకూరు టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై జరిగిన దాడిని ఎంపీ అరుణ ఖండించారు. రంగరాజన్ కు ఫోన్ చేసి పరామర్శించారు.

Tags

Next Story