Congress Meeting : ఈ నెల 15న కామారెడ్డిలో కాంగ్రెస్ సభ

ఈ నెల 15న కామారెడ్డిలో భారీ బహిరంగ సభకు పీసీసీ ప్లాన్ చేస్తోంది. 2023 నవంబర్ లో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరే షన్ సభను కామారెడ్డిలో ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో.. జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్లను పెంచుతామని అప్పటి టీపీసీసీ చీఫ్, ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు అధికారంలోకి రాగానే కులగణన చేపట్టడం బీసీ జనాభా లెక్కలు తేల్చడం విశేషం. అంతటితో ఆగకుండా విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చే యడంతోపాటు ఆ బిల్లు గవర్నర్ కు అక్కడి నుంచి కేంద్రానికి చేరింది. పంచాయతీరాజ్ చట్టం 2018ని సవరిస్తూ.. రిజర్వేషన్లలో 50% లిమిట్ ఎత్తేసేలా మార్పులు చేస్తూ ఆర్డి నెన్స్ కూడా ఇచ్చింది. ఈ రెండింటిపై కేంద్రం స్పందించపోవడంతో ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు. బిల్లుకు ఆమోదం తెలుపాలని కోరేందుకు ఏకంగా రాష్ట్రపతిని కలిసేందుకు కాంగ్రెస్ నేతలు, రాష్ట్ర ప్రభుత్వం ప్రయ్నతించారు. తాజాగా కూడా మరో మారు అసెంబ్లీలో తీర్మానం చేశారు. కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. ఈ క్రమంలో జీవో ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాల నే యోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. న్యాయపరమైన చిక్కులు రాకుండా ఏర్పాట్లు చేసుకుంటోంది. అయితే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం తాము బీసీ రిజర్వేషన్లకు చిత్తశుద్ధి తోనే ఉన్నామని చెప్పుకోవడం లక్ష్యంగా భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఉమ్మడి ని జామాబాద్ జిల్లాకు చెందిన మహేశ్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకొని ఏడాది పూర్తవుతున్నందున పార్టీ, ప్రభుత్వ విజయా లను ప్రజలకు వివరించేందుకు కామారెడ్డిని వేదికగా చేసుకునేందుకు సిద్ధమవుతోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com