TG : రేవంత్ కు పీసీసీ ఇచ్చే మొగోడివా? కౌశిక్ రెడ్డిపై ఎమ్మెల్యే సామేల్ ఫైర్

TG : రేవంత్ కు పీసీసీ ఇచ్చే మొగోడివా? కౌశిక్ రెడ్డిపై ఎమ్మెల్యే సామేల్ ఫైర్
X

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇప్పించేంత పిచ్చిమాటలు మాట్లాడవద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డిని కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామ్యేల్ హెచ్చరించారు. పీసీసీ పదవి ఇప్పించాలని రేవంత్ రెడ్డి తన వద్దకు వచ్చారని కౌషిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మందుల సామ్యేల్ మండిపడ్డారు. కౌషిక్ కు మతిభ్రమించిందని ఆరోపించారు.

రేవంత్ రెడ్డిపై చేసిన ఆరోపణలను వెనక్కుతీసుకోవాలని లేకపోతే కాంగ్రెస్ కార్యకర్తలు తరిమి కొట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. నిజాం పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించింది కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలేనని, బీజేపీకి ఏ మాత్రం సంబంధం లేదని స్పష్టం చేశారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం మంత్రి వర్గ ఉప సంఘం వేయడం హర్షించదగ్గ విషయమని, త్వరలో వర్గీకరణ జరుగుతుందని సామ్యేల్ ధీమా వ్యక్తం చేశారు.

Tags

Next Story