TG : తెలంగాణకు న్యాయం చేయండి.. మోదీకి కాంగ్రెస్ ఎంపీలు లేఖ

TG : తెలంగాణకు న్యాయం చేయండి.. మోదీకి కాంగ్రెస్ ఎంపీలు లేఖ

తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేయాలని కోరుతూ ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కి లేఖ ఇచ్చిన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు. లేఖ కాపీ ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి కి కూడా అందజేశారు. ఈ సందర్భంగా శనివారం నాడు అసెంబ్లీ లాబీ లో నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ తెలంగాణ హక్కుగా రావాల్సిన అనేక అంశాలు ఉన్నాయని, న్యాయంగా రావాల్సిన నిధులు ప్రధాన మంత్రిని ఆడిగామని అన్నారు.

మెదక్ ఎంపీ రఘునందన్ రావ్ తెలంగాణకు అన్యాయం జరగలేదని అనడం హాస్యాస్పదంగా ఉందని ఆయన న్యాయవాది అని తెలంగాణ కు ఇంత అన్యాయం అవుతుంటే న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంటే తప్పుదారి పట్టించే విదంగా మాట్లాడుతున్నారని అన్నారు. ఆంద్రప్రదేశ్ విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెలంగాణ కు కూడా కొన్ని ప్రత్యేక హక్కులు ఇచ్చారని వాటిని న్యాయపరంగా మనకు ఇవ్వలేని వాటిని అడిగితే రఘునందన్ రావ్ అపహాస్యం చేసే విదంగా మాట్లాడడం వింతగా ఉందని అన్నారు.

తెలంగాణ రాష్ట్రానికి కాజీపేట లో రైల్వే కోచ్ తయారీ కేంద్రం, బయ్యారంలో ఇనుప పరిశ్రమ, ఐఐఎం, ఐటీఐఆర్, సాగునీటి ప్రాజెక్టు కు జాతీయ హోదాతో పాటు పలు హామీలు ఇచ్చారని ఆయన అన్నారు. బీజేపీ ఎంపీ లు తెలంగాణ కు హక్కుగా రావాల్సిన వాటిపై పోరాటాలు చేయకుండా మమ్మల్ని విమర్శించడం ఏమిటని అన్నారు. తెలంగాణ ప్రజలు ఓట్లు వేస్తే గెలిచిన ఎంపీలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని మాతో పాటు పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు..

Tags

Next Story