సెప్టెంబర్ 17పై కాంగ్రెస్ వైఖరి ఏమిటో చెప్పాలి : ఏలేటి మహేశ్వర రెడ్డి

సెప్టెంబర్ 17పై కాంగ్రెస్ వైఖరి ఏమిటో చెప్పాలి : ఏలేటి మహేశ్వర రెడ్డి

విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తూ వచ్చిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి విమర్శించారు. వరద నష్టంపై రెండు కేంద్ర బృందాలు రాష్ట్రంలో ఏరియల్ సర్వే చేస్తున్నాయని తెలిపారు. బుధవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడారు. చనిపోయిన కుటుంబాలకు కేంద్రం రూ. 3 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిందని గుర్తు చేశారు. అసదుద్దీన్ ఒవైసీకి కోపం వస్తుందనే కారణంతోనే అమీర్ అలీ ఖాన్‌కు మంత్రి పదవి ఇవ్వడం లేదని, ఎంఐఎం పార్టీకి భయపడే రాష్ట్ర ప్రభుత్వం విమోచన దినోత్సవం నిర్వహించడం లేదని ఆరోపించారు. సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగా ప్రకటించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి భయం ఎందుకు అని ప్రశ్నించారు. హైదరాబాద్ సంస్థానం నుంచి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో జిల్లాలను కలిపారని, ఆ రెండు రాష్ట్రాల్లోని జిల్లాలు విమోచన దినోత్సవ వేడుకలు జరుపుకుంటాయని వివరించారు. అసలు సెప్టెంబర్ 17 పై కాంగ్రెస్ వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు.

Tags

Next Story