Telangana News : అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన బీఆర్ ఎస్.. ఏంటీ స్ట్రాటజీ..

Telangana News : అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన బీఆర్ ఎస్.. ఏంటీ స్ట్రాటజీ..
X

బీఆర్ ఎస్ అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేసింది. తాజా సమావేశాలకు వెళ్లొద్దని ఆ పార్టీ డిసైడ్ అవుతూ వాకౌట్ చేసింది. అయితే దీనిపై కాంగ్రెస్ వాదన మరోలా ఉంది. మూసీ ప్రక్షాళనపై మైక్ ఇవ్వకపోతే మిగతా విషయాలను ఎందుకు మాట్లాడకూడదు అని ప్రశ్నిస్తోంది. ఒక విషయాన్ని సాకుగా చూపి అసెంబ్లీ సెషన్స్ మొత్తాన్ని బాయ్ కాట్ చేయడం ఏంటని కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. బీఆర్ ఎస్ లొసుగులు బయటపడుతాయనే భయంతోనే ఇలా చేశారని అంటున్నారు. రేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి కృష్ణా జలాల వాటా మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. కానీ దానికి బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు హాజరు కావట్లేదు.

బీఆర్ ఎస్ నుంచి హరీష్ రావు తెలంగాణ భవన్ లో ప్రజెంటేషన్ ఇస్తారంట. ఇలా నదీ జలాలపై ఎవరికి వారే ప్రజెంటేషన్లు ఇచ్చుకోవడం ఏంటో మరి వారికే తెలియాలి. అయితే బీఆర్ ఎస్ అధినేత కేసీఆరే ఈ నదీ జలాల విషయంపై రగడ మొదలు పెట్టారు కదా. మరి అలాంటప్పుడు ఆ అంశం మీదనే అసెంబ్లీలో ఎందుకు ప్రశ్నించకూడదు అనేది ఇంకో ప్రశ్న. అంత పెద్ద వివాదాన్ని రాజేసిన కేసీఆర్ ఎలాగూ అసెంబ్లీకి రావట్లేదు. మరి బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి రాకుండా దానిపై ఫైట్ చేస్తామంటే ఎలా. బయట ప్రశ్నించే అంశాలనే అసెంబ్లీలో ప్రశ్నిస్తే బాగుంటుందని అటు కాంగ్రెస్ నేతలు అంటున్నారు. తమ ప్రభుత్వం తప్పు చేస్తే ప్రశ్నించొచ్చు అని కాంగ్రెస్ చెబుతోంది. కానీ అసెంబ్లీలోకి రావడానికి బీఆర్ ఎస్ సిద్ధంగా లేదు. మొత్తానికి ఎవరి దారి వారిదే అన్నట్టు నడుస్తోంది ఈ నదీ జలాల మీద.


Tags

Next Story