MLA Koonamneni : ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సపోర్టు : ఎమ్మెల్యే కూనంనేని

స్థానిక సంస్థల ఎన్నికల్లో బలంగా ఉన్న చోట పోటీ చేస్తామని, కాంగ్రెస్ పార్టీ కలిసి వస్తే ముందుకూ వెళ్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో హస్తం పార్టీ అభ్యర్థికే తమ మద్దతు ఇస్తున్నామని, టీచర్ అభ్యర్థుల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై చర్చిస్తున్నామని తెలిపారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 'ఢిల్లీ ఎన్నికల ఫలితా లతో దేశ రాజకీయాలు ప్రమాదంలో పడ్డాయి. ఇండియా కూటమి విచ్ఛిన్నం అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఆర్ఎస్ఎస్ బలగాలను మోహరించి ప్రజల మైండ్ సెట్ ను మార్చేస్తున్నారు. మత రాజ్యంగా మార్చే కుట్రలు జరుగుతున్నాయి. రామరాజ్యం పేరుతో చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అరకుడిపై దాడి చేశారు. కాంగ్రెస్ పార్టీకి కలుపుకుని పోవడం చేతకావడం లేదు. కుల గణనపై బీజేపీ రాజకీయం చేస్తుంది. మావోయిస్టుల ఎన్ కౌంటర్ పై న్యాయ విచారణ జరిపించాలి. 2026 మార్చి నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తామని అమిత్ షా అన్నారు. చెడ్డ వాటికి ముహూర్తం పెట్టే వాళ్లు రాక్షసులు. దోపిడి, దొంగతనాలు, కుంభకోణాలు చేసిన వాళ్లు చట్టసభల్లో కూర్చుంటున్నారు. అం తర్జాతీయ న్యాయ సూత్రాలకు ఇది విరుద్ధం. ఎస్సీ వర్గీకరణ, బీసీ కుల గణన చేయడాన్ని స్వాగతిస్తున్నం. రాష్ట్ర ప్రభుత్వం మొండిపోకడకు వెళ్లకుండా ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి' అని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com